Narayanaswamy meets Jagan : మాజీ సీఎం జగన్ ను క లిసిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సమన్వయకర్త కృపా లక్ష్మి నేతృత్వంలో పలువురు నాయకులు గురువారం వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీలో ఎం. దయ సాగర్ రెడ్డి, పిల్లారి కుప్పం గిరిధర్ రెడ్డి, కామసాని లోకేశ్వర్ రెడ్డి, పందికుంట దేవరాజులు రెడ్డి, జ్యోతినాథ్,వినోద్ రెడ్డి, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు.

కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పార్టీ బలోపేతం అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బోలోపేతం దిశగా సమన్వయంతో పని చేయాలని జగన్మోహన్ రెడ్డి వారికి సూచించినట్లుగా నాయకులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Deputy CM Narayanaswamy meets former CM Jagan

You cannot copy content of this page

Scroll to Top