
పశువుల తాగు నీటి కుండీలు ఏర్పాటు. జనసేన చిట్టం మురళి
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అరుకు నియోజకవర్గ అనంతగిరి మండలం ఏప్రిల్ 2:
అనంతగిరి మండలం చిలకలగడ పంచాయితీ లో నీటి కుండిలా ఏర్పాటుకి శంకుస్థాపన ఈ సందర్భంగా
జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ..
వేసవిలో మూగజీవుల తాగునీటి అవసరాలకు కూటమి ప్రభుత్వం మండలాల వారీగా నీటి కుండీల స్కీం ప్రారంభించడం జరిగింది.పశు సంపద యొక్క ఆవశ్యకత పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆలోచనల్లో ఈ స్కీం అత్యంత ప్రధానమైనది. జనసేన పార్టీ నాయకులు ఈ అంశాన్ని గిరిజన రైతాంగానికి విస్తృతంగా ప్రచారం చేసి పశు సంపద అత్యధికంగా కలిగివున్న ప్రాంతాలను గుర్తించి వాటికి ఈ వేసవిలో తాగు నీటి సౌకర్యం కల్పించడానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం గురించి మన గిరిజన ప్రజలకు తెలియజేయాలని ఆయన అన్నారు.
ఇటీవలే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి సూచిక లో ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా,మన్యం జిల్లా ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నాయని అందుకు గల కారణాలు గా సహజ ప్రకృతి వనరులు,ప్రకృతి వ్యవసాయం వంటి కీలక విషయాలు అల్లూరి సీతారామరాజు జిల్లా అభివృద్ధికి ప్రదనకారణమన్నారు ముఖ్యమంత్రి తెలిపినట్టు ఈ అభివృద్ధి లో పశు సంపద మన సహజ వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు ఒక బలమైన కారణంగా మనం భావించవచ్చు నేటి యువత ఇటువంటి కీలకమైన అంశాలపై సూక్ష్మ ఆలోచన చేయాలని పాడి పశువుల సంపద వృద్ధి కి తోడ్పడేలా ఆలోచన చేస్తూనే మన ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని గిరిజన రైతులకు తెలపాలన్నారు.
మాకు వ్యక్తిగతంగా పశువుల కోసం నీటి కుండిల ఏర్పాటు కి శంకుస్థాపనకు మాకు ఆహ్వానించడం మా చేతి తో ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయం గా భావిస్తున్నాం.మా అధినేత ఆలోచన విధానం తో మేము బాగస్వామ్యులవ్వడం ప్రారంభించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలుపుతున్నమన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ దీసరి గంగరాజు,ఎంపిపి చెట్టి నీలవేణి, మెతుల ఎంపీటీసీ సర్పంచ్ అప్పారావు, ప్రభుత్వ అధికారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
