నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 250 మంది విద్యార్థినులకు అస్వస్థత

హైదరాబాద్ :

నారాయణ కళాశాల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. మల్లంపేట్‌ ORR బ్రాంచ్‌ గర్ల్స్‌ క్యాంపస్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఏకంగా 250 విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలం చెల్లిన పదార్ధాలను ఉపయోగిస్తూ ఆహారం వండుతున్నారని విద్యార్ధినిలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, మంచినీరు సైతం పరిశుభ్రంగా ఉండటంలేదని, వంటశాల అపరిశుభ్రంగా ఉంటోందని, ఆహారం విషయంలో కానీ, శుభ్రత విషయంలో కానీ నాణ్యత పాటించడంలేదని విద్యార్ధినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయిన 200 మంది విద్యార్థినిలను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించివేసింది. కళాశాలలో 2 వేలమందికి పైగా విద్యార్ధినిలు ఉండటంతో వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లక్షల్లో ఫీజులు వసూలు
చేసి పిల్లల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కళాశాల నిర్వాహకులు, అధికారులు హాస్టల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top