
Food Inspector : త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. గోదావరిఖనిలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారులు నిర్వహించామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు గోదావరిఖనిలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తీవ్ర ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయని, ఈ తనిఖీకి సంబంధించి
అపరిశుభ్రత రెస్టారెంట్ వంటగది దాని పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు పిండి పదార్థాలలో బొద్దింకలు ఉండటాన్ని గమనించిన అధికారులు 35 కిలోల గోధుమ పిండి, 10 కిలోల మైదా పిండిని అక్కడికక్కడే పారవేయించారు నిల్వ ఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ లివర్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని, కట్ చేసి బహిరంగంగా నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా గుర్తించి పారవేశామని అన్నారు.
ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను (ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించమని, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం (ఫస్ యాక్ట్, 2006), లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు గాను, రెస్టారెంట్ యజమానులపై అడ్జుడికేషన్ అద్జుడికేషన్ కేసు నమోదు చేయనున్నట్లు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

