తేదీ : 02/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఐదవ డివిజన్ లో పార్లమెంటు ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వాళ్లకు వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమలు జరుగుతున్నాయని తెలిపారు.
ఆగస్టు పదిహేను వ తేది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అదేవిధంగా ఆటో కార్మికుల ఇబ్బంది పడకుండా వాళ్లకు ఆగస్టు పద్నాలుగు వ తేదీన రూపాయలు పదిహేను ముఖ్యమంత్రి అందజేయనున్నట్లు చెప్పడం జరిగింది. ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ తో పాటు మాజీ ఎమ్మెల్సీబి. వెంకన్న , రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, సయ్యద్ రఫీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డి. రాకేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు చిట్టా.బత్తుని. శ్రీనివాసరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు యస్. సంజయ్ వర్మ మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీముల్లా, ఈఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


