జూన్ 26, 2026

IMG 20241028 WA0017

TRINETHRAM NEWS

వికారాబాద్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ సర్వేలో మొదటి దశ పూర్తి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్, డిటిసిపి టీమ్, మున్సిపల్ సిబ్బందిని అభినందించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు.సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఆధ్వర్యంలో అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా గత 10 రోజులుగా డ్రోన్ కెమెరాల ద్వారా నడుస్తున్న వికారాబాద్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే మొదటి దశ ఈరోజుతో పూర్తయిందని *వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు.

ఈసందర్భంగా మాస్టర్ప్లాన్సర్వేనువిజయవంతంగా పూర్తి చేసిన సర్వే ఆఫ్ ఇండియా టీమ్, డిటిసిపి టీమ్ తో పాటు మున్సిపల్సిబ్బందిని చైర్ పర్సన్ అభినందించారు. ఇట్టి సర్వే రిపోర్ట్నుప్రభుత్వానికి పంపించి పూర్తి మాస్టర్ ప్లాన్ తయారుచేయాల్సిఉంటుందని చైర్ పర్సన్ గారువెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఈ రాకేష్ రెడ్డి, టిపిఓ వేణుగోపాల్, సర్వే ఆఫ్ ఇండియా టీమ్, మున్సిపల్ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page