జూలై 5, 2026
TRINETHRAM NEWS
Fire Breaks Out in Container Truck

Fire : త్రినేత్రం న్యూస్ : May 21, 2026, తెలంగాణ : మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో NH-44 పై వెళ్తున్న కంటైనర్ లారీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కొత్త కార్లను తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. లారీలో ఉన్న 8 మారుతీ సుజుకి కార్లు పూర్తిగా కాలిపోయాయి.

షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా. కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page