
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్. ఫిబ్రవరి 6న రోడ్డు ప్రమాదంలో శంకర్ పల్లి మండలం బుల్కపురం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి బాధాకరమని అతని స్నేహితులు అన్నారు.2018 కానిస్టేబుల్ బ్యాచ్ కు చెందిన శ్రీనివాస్ స్నేహితులు అతని కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని అనుకున్నారు.అందులో భాగంగా స్నేహితుల నుంచి రూ.1,10,100 లను కలెక్ట్ చేశారు.ఆ డబ్బును కుటుంబ సభ్యులకు ఇవ్వాలని వెళ్లగా వారు నిరాకరించి,ఏదైనా అనాధ ఆశ్రమానికి డోనేట్ చేయాలని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సూచించారు.
దీనితో కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని దన్నారంలో ఉన్న యజ్ఞ ఫౌండేషన్ వివేకానంద గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉజ్వల్ రాజ్ కు ఆ అమౌంట్ అందజేశారు.అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.స్నేహితుని కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకొని వారు మంచి మనసును చాటుకుంటే,కుటుంబ సభ్యులు అమౌంట్ ను అనాధ ఆశ్రమానికి ఇవ్వాలని సూచించి గొప్ప ఉదార స్వభావాన్ని చాటుకున్నారని పలువురు అంటున్నారు.ఈ కార్యక్రమంలో మృతి చెందిన శ్రీనివాస్ సోదరుడు బుచ్చి రాజ్,2018 కానిస్టేబుల్ బ్యాచ్ స్నేహితులు శ్రీశైలం, ప్రేమ్ సాయి, రాజ్ కుమార్,మహేష్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
