జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Financial assistance to the victim

Financial Assistance : త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి. పెనుమూరు. పెనుమూరు మండల పరిధిలోని కలికిరి గ్రామానికి చెందిన డి. జానకమ్మ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹47,248/- ఆర్థిక సహాయం మంజూరైంది. స్థానిక మ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ఆదేశాల మేరకు చెక్కు నం. 718077, తేదీ 23-04-2026తో జారీ చేసిన చెక్కును కుమారుడు హేమాద్రి నాయుడు కి మండల అధ్యక్షులు రుద్రయ్య నాయుడు చేతుల మీదుగా అందజేశారు.
ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న జానకమ్మ కి ప్రభుత్వం స్పందించి సహాయం అందించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, సంబంధిత ప్రజాప్రతినిధులు మరియు నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా చర్యలు కొనసాగుతున్నాయని రుద్రయ్య నాయుడు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page