Financial Assistance : దేవరకొండ పెన్షనర్స్ భవన నిర్మాణ నిధికి ఆర్థిక సహాయం అందజేత

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్, అక్టోబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించబడినది. ఈ సమావేశమునకు హాజరైన సంఘ సభ్యులు బత్తుల శాంసన్ సతీ సమేతంగా హాజరై సేవాసదనము మొదటి అంతస్తు నిర్మాణమునకు ఆర్థిక సహకారంగా రూపాయలు 10,116 కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగునూరు లింగయ్య లకు అందజేసినారు. ఈ సందర్భంలో కార్యవర్గ సభ్యులు శాంసన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ, సహాధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి ,ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్, పడమటి శాంతకుమారి ,వనం బుచ్చయ్య ,మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ ,కంచర్ల నారాయణరెడ్డి, జంపాల యాదగిరి ,మోటమర్రి పురుషోత్తం ఆలంపల్లి శ్రీనివాస్, అప్ప వీరయ్య, తాడూరు సత్యం, గోకి కాల్ ప్రభాకర్ బొల్లేడు లక్ష్మయ్య, లక్ష్మణ చారి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Financial assistance provided to Devarakonda Pensioners

You cannot copy content of this page

Scroll to Top