అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 7 : అరకువేలి మండలం బస్కి పంచాయతీ, కొంత్రాయిగూడ గ్రామంలో, ఏళ్ల తరబడి మంచి నీటి సమస్య కోసం అనేక దపాలుగా అధికారులకు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఫిర్యాదులు చేసి ,ఎన్నో పోరాటాలు నిర్వహించారు. గిరిజన సంఘం పోరాటం ప్రతిఫలంగా గ్రామస్తులకు నీటి సమస్య పరిష్కారం కోసం బస్కి పంచాయితీ, కొంత్రాయిగూడ గ్రామంలో విద్యుత్ సరఫరా కల్పిస్తున్న సంబంధిత అధికారులకు, మరియు గిరిజన సంఘం నాయకులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
గ్రామంలో మంచినీరు అందించడానికి మిగిలిన పనులను కూడా ఆర్ డబ్ల్యు ఎస్, అధికారులు వాటర్ కలెక్షన్ ఇచ్చి మిగిలిన, పనులు పూర్తి చేయాలని, గ్రామస్తులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫెసా కార్యదర్శి కే. దేవన్న, గిరిజన సంఘం, పంచాయతీ నాయకులు, సింహాద్రి ,సమర్థి కోగేశ్వరరావు, కన్నయ్య ,సుబ్బారావు, రమేష్. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


