చేబ్రోలులో పవన్ కల్యాణ్ నివాసానికి తుది మెరుగులు

TRINETHRAM NEWS

Trinethram News : పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కల్యాణ్

ఈ మేరకు జిల్లాలోని చేబ్రోలు నివాసంలో పవన్ నివాసానికి తుదిమెరుగులు

ఆదివారం నుంచి ప్రచారకార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న జనసేన అధినేత పవన్ ప్రకటన నేపథ్యంలో ఈ దిశగా వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పవన్ నివసించనున్న భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేశారు.

ఇక వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈ నెల 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పర్యటిస్తారని పార్టీ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. అంతేకాకుండా, ఉగాది పండుగ పురస్కరించుకుని ఏప్రిల్ 9న పిఠాపురం నియోజకవర్గంలో జరిగే వేడుకల్లో పవన్ పాల్గొంటారు. జ్వరం కారణంగా పవన్ ప్రచార కార్యక్రమానికి రెండు రోజుల విరామం ప్రకటించారు. ఆదివారం నుంచి యథావిధిగా ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తారని పార్టీ తెలిపింది. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ త్వరలో ఖరారు చేయనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top