సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Felicitation Venugopala Krishna

రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రకటన

Felicitation Venugopala Krishna : త్రినేత్రం న్యూస్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ప్రకటించిన సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొందేశీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గొందేశీ మేన్షన్‌లో మిత్ర బృందం వేణుగోపాలకృష్ణను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసింది.
అనంతరం మురమండ సర్పంచ్ అయినవిల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మురమండ గ్రామానికి చెందిన నాయకులు వేణుగోపాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సయ్యద్ రుఖియా ఆధ్వర్యంలో మహిళలు వేణుగోపాలకృష్ణను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page