
Trinethram : భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే.1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతను సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే రచయితగా ఈ కాలంలో అతను 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించాడు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అతను ఎంతో కృషిచేశాడు. వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.
