WhatsApp Image 2024 03 07 at 08.17.51
Trinethram News : తిరుపతి ;తిరుపతి నగరంలోని ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉంటాయి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం అమ్ములించు ద్వారా తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఏదేమైనా ఫ్లై ఓవర్ పై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అటు ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించిపోవడంతో అతివేగంగా వాహనాలు ప్రయాణిస్తూ ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
