Road Accident : భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

భూపాలపల్లి జిల్లా-మే:26 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రెండు కార్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శివారులోని నస్తూరి పల్లి గ్రామం వద్ద ఆదివారం సాయంత్రంచోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న దుర్గోజి కుటుంబ సభ్యులు 9 మందితో కలిసి కారులో కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన రేషన్ డీలర్ లక్ష్మీనరసింహా రావు కుటుంబం ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి కారులో కాలేశ్వరం వెళుతు న్నారు.

ఈ క్రమంలో కాటారం- నస్తూరుపల్లి మార్గమధ్యంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి దీంతో తవేరా వాహనంలో ప్రయాణిస్తున్న రేషన్ డీలర్ లక్ష్మీనారాయణ రావు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, కాటారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంబు లెన్స్ లో భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వాహనంలో చిక్కు కోగా జేసీబీ సహాయంతో అతన్ని బయటకు తీశారు అనంతరం పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో వీరిని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు
ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా కాటారం పోలీసులు జేసీబీ సహాయంతో రెండు కార్ లను రోడ్డుపై నుండి ప్రక్కకు జరిపించారు. కియా కార్లో ప్రయాణిస్తున్న భక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు కారు లోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో త్రుటిలో ప్రమాదం నుండి తప్పించు కున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నట్లు కాటారం పోలీసులు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fatal road accident in

You cannot copy content of this page

Scroll to Top