Trinethram News : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని నాయకులతో కలిసి, నియోజకవర్గ పరిధిలో గల పలు సమస్యలను చర్చించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు..
ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు రాకుండా సకాలంలో వడ్ల, పత్తి కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇసుక పర్మీషన్లు ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిన ఎమ్మెల్యే. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా చూడాలి.
నియోజకవర్గనికి మంజూరైన సబ్ స్టేషన్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకొవాలని సూచించిన ఎమ్మెల్యే. వీటితో పాటు ముఖ్యమైన పలు సమస్యలను కలెక్టర్ తో చర్చించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


