
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, మర్రివాడ పంచాయతీ నందు గల, లూసం మరియు సాకులు పాలెం నందు గంజాయి సాగు నిర్మూలన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారిని, ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు గంజాయి సాగు రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని, గంజాయి సాగు రవాణాకు పాల్పడితే శిక్షార్హులు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గంజాయి పంట వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా గిరిజన రైతులు గంజాయి సాగుకు దూరంగా ఉండాలని, చెప్పడం జరిగింది. దీనికిగాను వ్యవసాయ శాఖ , సాంప్రదాయ పంటలైనటువంటి రాగులు,గంటెలు, కొర్రలు మరియు సామలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు . ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సతీష్ పాల్గొన్నారు. రైతులులకు సాగునీటిబోరు కొట్టించేందుకు అవకాశం కల్పించవలసిందిగా వ్యవసాయ అధికారి కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
