రైతు భరోసా? మద్దతు ధర? వాస్తవానికి దూరంగా ప్రభుత్వ విధానాలు
అనపర్తి : త్రినేత్రంన్యూస్ : రైతులను రాజులుగా మార్చినది జగనన్న ప్రభుత్వం కాగా, అదే రైతులను దగా చేసి, కనీస మద్దతు ధర కూడ లేకుండా నట్టేట ముంచినది కూటమి ప్రభుత్వం అని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతును దేవుడిగా చూస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగగా మలిచిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, చేసిన సేవలను ప్రజలు ఈరోజుకీ గుర్తు చేసుకుంటున్నారు. అయితే అదే వ్యవసాయాన్ని ఓ భారంగా, దండగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
ప్రస్తుత ప్రభుత్వం రైతులకు మద్దతు ధర, రైతు భరోసా పేరిట ఎన్నో హామీలు ఇచ్చినా… వాటిలో అమలు అయినదేమీ లేదు. రైతులకు ప్రతి సంవత్సరం రూ. 20,000 ఇచ్చే రైతు భరోసా ఇంకా అమలవ్వలేదు. మద్దతు ధరపై కూడా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ధాన్యానికి కనీస మద్దతు ధర (ఏం ఎస్ పి) రూ. 1,725 ఉండాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో రైతుల నుంచి కేవలం రూ. 1,550కి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు కూడా నిలిపివేసింది. దీంతో రైతులు గత సీజన్ కి ఇప్పుడు సీజన్ కి ఎకరానికి రూ. 10,000 వరకు నష్టపోతున్నారు.
స్థానిక శాసనసభ్యులు, కూటమి నాయకులు తమకు అనుకూలంగా లబ్ధి పొందుతున్నప్పటికీ, సామాన్య రైతుల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు కనీస స్పందన కూడా లేదు.
అనపర్తి స్థానిక శాసనసభ్యుడు, రామకృష్ణారెడ్డి మీడియా ముందు మాటలు చెప్పడమే తప్ప, వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం కనిపించడం లేదు. “సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నా”, “మంత్రితో మాట్లాడా” అని చెప్పే మాటలు ఈ రోజు రైతులకు ఉపశమనం ఇవ్వడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా అనపర్తి
శాసనసభ్యుడు, రామకృష్ణారెడ్డి మాటలు మాటలుగానే మిగిలిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంట బీమా అమలు కాలేదు. వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోతే పరిహారం లేదు. రైతుల నష్టాల్లో ఉన్న లాభపడేది మాత్రం స్థానిక శాసనసభ్యులు,కూటమి నాయకులు. డబ్బు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్తోంది అన్న ప్రశ్నలు ప్రజల్లో కలుగుతున్నాయి.
ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం
రైతు ఉసురు తగిలితే ఏ ప్రభుత్వమైనా నిలవదు. రైతులకు మద్దతు ధర కల్పించాలి, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మాటలు కాదు, చేతల్లో చేసి చూపించాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


