
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం. అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాబు
*అన్నపురెడ్డిపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల నరేష్ ప్రేస్ తో మాట్లాడుతూ అశ్వారావుపేట నియెజకవర్గంలో సీతారామ ప్రాజెక్ట్ కాలువ ద్వారా అన్ని మండలాల్లోగల గ్రామ రైతులు వరి, మరియు ఆరుతడి పంటలకు గత నాలుగు రోజులు నుండి సీతారామ కెనాల్ లో నుంచి నీళ్ళు పుష్కలంగా పారుతున్నాయి. సదరు రైతులు మోటర్లు, ఇంజన్ల ద్వారా వారి పంట పొలాలకు నీళ్ళు పెట్టుకుంటు సంతోషంతో కాలువలో పారుతున్న గోదావరి జలాలకు పూజలు చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
అదేవిధంగా ములకలపల్లి మండలం రామచంద్రపురం గ్రామ ప్రజలతోపాటు పలువురు మహిళలు గోదావరి జలాలను తీసుకుని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి అభిషేకించడానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. అన్ని గ్రామాల్లో రైతులు గత నాలుగు రోజులు నుండి ఎంతో సంతోషంగా గోదావరి జలాలను చూడటానికి పెద్ద ఎత్తుగా వెళుతున్నరాని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
