నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Nandili Sukrayya Files B-Form

Nandili Sukrayya Files B-Form : అరకులోయ, అక్టోబర్ 27, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలోని చొంపి & శిరగం సిగ్మెంట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా నందిలి సుక్రయ్య సోమవారం ఎన్నికల అధికారి (ఆర్వో)కు బి-ఫాం అందజేశారు.
ఈ సందర్భంగా నందిలి సుక్రయ్య మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగానికి కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి సహకరించిన పార్టీ నాయకులు, చొంపి & శిరగం సిగ్మెంట్ పంచాయతీల పెద్దలు, కార్యకర్తలు, మిత్రులు, ప్రజలు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
చొంపి & శిరగం సిగ్మెంట్ పంచాయతీల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడమే తన ప్రధాన లక్ష్యమని సుక్రయ్య స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, రెండు సెగ్మెంట్ల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని సుక్రయ్య పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనకు మద్దతుగా నిలిచి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,చొంపి & శిరగం సిగ్మెంట్ కు చెందిన పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page