తేదీ : 15/06/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి జిల్లా వైసిపి అధ్యక్షులు మాజీమంత్రి గుడివాడ. అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. వెన్నుపోటు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. వైసిపి నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. వైసిపి నేతల నే టార్గెట్గా చేసి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో అక్రమ మైనింగ్ పై పోరాటం చేస్తామని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


