Trinethram News : అమరావతి : ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సర్వీసును 2025-26 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 957 మంది సర్వీసును పొడిగించింది. ఈనెల ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు వీరి యొక్క సేవలను వినియోగించుకోనుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటి వరకు వీరి సేవలను నిలిపివేస్తారు. సెలవుల అనంతరం తరగతుల బోధనకు తీసుకుంటారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


