వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణా సిద్దాంత కర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ అన్నారు. బుధవారం కాల్లెక్ట్రేట్ కార్యాలయ సమావేశము హాలు నందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి జిల్లాఅదనపు కలెక్టర్ మరియు అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయ శంకర్ 91 వ జయంతి వేడుకలు పురష్కరించుకొని వారి యొక్క సేవలను కొనియాడారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ బాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణా ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. తెలంగాణా ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని , తెలంగాణా ఉద్యమ సిదంతా కర్త అని వారి ఉద్యమ స్పర్తిని, సేవలను కొనియాడారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణ మనకు సిద్ధించిందని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు తూచ తప్పకుండా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వెనుకబడిన తరగతుల అబివృద్ది అధికారి ఉపేందర్, డి ఆర్ డి ఎ శ్రీనివాస్ , జిల్లా అధికారులు , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


