జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 28 at 17.09.35

TRINETHRAM NEWS

రక్తదానం చేయడానికి అందరు ముందుకు రావాలి

అందరు రక్తదానం చేయండి ప్రాణ దాతలుగా నిలవండి పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్.,

పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో మెగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల వారోత్సవాల (ఫ్లాగ్ డే) సందర్భంగా

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదానం శిభిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికిశిబిరాన్ని ముఖ్య అతిధిగా పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి హాజరై పోలీస్ అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అమరవీర జవానులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా కమీషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే ప్రాణ దాతలుగా మారాలని అన్నారు. అన్నిటికంటే గొప్పదానమైన రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడాలని సూచించారు. సకాలంలో రక్తం అందించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయ్యారని రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు.

రక్తదానం ఇవ్వడానికి వాలంటరీగా వచ్చిన వారి అందరిని సీపీ అభినందనలు తెలిపారు. శిబిరంలో పోలీసులతో పాటు యువత 400 మంది పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేయడానికి రావడం ఎంతో అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. సీపీ రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్., పెద్దపల్లి ఏసిపి కృష్ణ, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది, లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page