రైతులు పంటల భీమాను ప్రతి ఒక్కరు నమోదు చేయించుకోవాలి…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మండపేట మండలం ఏడిద గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి వ్యవసాయ విభాగం సంయుక్తంగా రైతులకు డ్రోన్ ఉపయోగించి అగ్ని అస్త్రాన్ని పిచికారి చేయడం క్షేత్రస్థాయిలో చూపించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి కే ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు సబ్ డివిజన్ ఏడిఏ కేవీఎస్ చౌదరి మాట్లాడుతూ ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు మరియు కావలసినన్ని ఆహార ధాన్యాలు ఉన్నా కానీ దానిలో ఉండే రసాయనిక పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉండడం వలన ప్రజలకు అనారోగ్యం పాలు అవుతున్నారని దీనిని గమనించి సొంత పొలం కలిగిన ప్రతి రైతు కూడా కొద్ది మొత్తంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి తన కుటుంబ వరకు ఎటువంటి ఎరువులు పురుగు మందులు ఉపయోగించకుండా వచ్చిన ఆహార ధాన్యాలను తీసుకోవడం వలన తన కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని రైతులకు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి చిన్న ప్రదేశంలో అయినా సరే కూరగాయలను మరియు ఆకుకూరలను తమ ఇంటి అవసరాలకు తప్పనిసరిగా ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా పండించుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవాలని తెలియపరిచారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులు వారి యొక్క అనుభవాలను రైతులకు వివరించడం జరిగినది. మండల వ్యవసాయ అధికారికే ప్రభాకర్ మాట్లాడుతూ డ్రోన్ ఉపయోగించి పిచికారి చేయడం వలన సమర్థవంతంగా మన ఉపయోగించే పురుగుమందు కానీ అదేవిధంగా కాషాయాలు కానీ పంట పొలానికి ఉపయోగపడుతుందని సమయం కూడా వృధా కాకుండా ఉంటుందని రైతులకు తెలియపరిచారు. మేక సురేష్ గారి పొలంలో అగ్నిస్త్రం డ్రోన్ ద్వారా పిచికారి చేసి రైతులకు అవగాహన కల్పించడం జరిగినది.
ఈ అగ్నిస్త్రం ప్రయోగించడం వలన కాండం తొలిచే పురుగు మరియు ఇతర పంటపొలంకి నష్టం కలిగించే చిన్న పురుగులు కూడా చనిపోతాయని రైతులకు తెలియపరిచారు. రసాయనకు పురుగుమందులు బదులుగా ఇటువంటి ప్రకృతి సంబంధిత కషాయాలను ఉపయోగించడం వలన రైతులకు ఉపయోగపడే మిత్ర పురుగులను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులకు తెలియపరిచారు. ఈ యొక్క డ్రోన్లను ప్రభుత్వం 80% సబ్సిడీతో సరఫరా చేస్తుందని రైతులందరూ కూడా డ్రోన్ ద్వారా పిచికారి చేసుకోవడం అలవాటు చేసుకోవాలని తెలియపరిచారు. తదుపరి పంట నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగినది. రైతులు పంటల భీమాను ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలని దీనికి ఆగస్టు 15తో సమయం ముగిస్తున్నందున రైతులు త్వరితగతిన చేయించుకోవాలని తెలియపరచారు. దీని కొరకు పట్టాదారు పాసుబుక్కు మరియు ఆధార్ కార్డు జిరాక్స్ రైతు పంట వేసినట్లుగా మీ యొక్క రైతు సేవ కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుల నుండి పంట ధ్రువీకరణ పత్రం తీసుకొని సమీప మీసేవ కేంద్రంలో పంటల భీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ప్రతి రైతు కూడా పంట నమోదు ను చేయించుకోవాలని తెలియపరుస్తూ రైతు వేసినటువంటి పంట మరియు వాటి రకాన్ని కచ్చితంగా తెలియపరచాలని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వారి యొక్క కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రకృతి వ్యవసాయానికి కావలసిన కాషాయాలు తయారీ విధానం గురించి రైతులకు తెలియపరిచారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చిన రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయం యాజమాన్య పద్ధతుల గురించి క్షేత్రస్థాయిలో వివరిస్తామని తెలియపరిచారు. తదుపరి పంటల ధ్రువీకరణ పత్రాలను రైతులకు అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు గొడవర్తి ఎర్రబ్బు , నీటి సంఘం అధ్యక్షులు కోలిపాటి బాబు, గ్రామ నాయకులు పర్వతేన వీర్రాజు , మేక జేజి బాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు ,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎం.టి స్వర్ణలత, ఎన్ఎఫ్ఏ అనంత కుమార్, వైపి శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


