జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 27 at 17.44.46

TRINETHRAM NEWS

Eluru Mayor Sheikh Noor Jahan’s couple joined TDP

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్

అమరావతిః ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.

ఉండవల్లి నివాసంలో వీరిందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైకాపా గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Eluru Mayor Sheikh Noor Jahan's couple joined TDP

You cannot copy content of this page