పొలం బాటలో విద్యుత్ అధికారులు

TRINETHRAM NEWS

పొలం బాటలో విద్యుత్ అధికారులు

రచ్చపల్లి గ్రామం ,ధర్మారం మండలం లో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు వినియోగదారులతో మాట్లాడుతూ గ్రామం లో విద్యుత్ సమస్యలు ఉన్నాయా అని రైతులతో మాట్లాడుతూ వివరాలు తెల్సుకున్నారు .రైతులు వారి పొలాల వద్ద స్టారర్లు, ఫ్యూజులు, స్టారర్ బాక్సులు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు, మోటర్ లకు కెపాసిటర్లు బిగించుకోవాలని సూచించారు. విద్యుత్ పరంగా ఏమైనా సమస్యలుంటే విద్యుత్ సిబ్బందికి మరియు టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు సమాచారం అందించాలని సూచించారు.రైతులు లోవోల్టేజి సమస్య రాకుండా కెపాసిటర్లు బిగించుకోవాలని టిజిఎన్ఏపిడిసిఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు అన్నారు. కెపాసిటర్ మోటార్లకు ఉంటె మోటార్ మన్నికగా ఎక్కువ కలం పనిచేస్తాయని లో వోల్టాజి సమస్యలు కూడా ఉండవని తెలిపారు వంగిన స్థంబాలు , లూస్ లైన్లు పాడైన ఐరన్ స్తంబాలు లో వోల్టాజ్ సమస్యలు ఉన్న సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ గాని విద్యుత్ సిబ్బందికి గాని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటి వరకు రచ్చపల్లి గ్రామం లో 127 స్తంభాలను లూస్ లైన్లను సరిచేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . పొలాల చుట్టు అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయవద్దని, తద్వారా రైతులు, పశువులు విద్యుత్ ప్రమాదాలకు గురికా కుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు తో పాటు పెద్దపల్లి డివిజనల్ ఇంజనీర్ దాసరి తిరుపతి డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ శ్రీ బి. రవి విజయ్ గోపాల్ సింగ్ ADE మహిపాల్ రెడ్డి ఏ ఈ మరియు సెక్షన్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top