
Indian Federation of Trade Unions (IFTU) elected new state executive committee
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
23-06-2024 నా ఇల్లందు పట్టణంలో జరిగిన భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని 17 మందితో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే విశ్వనాథ్, ఆరెల్లి క్రిష్ణ లు తెలిపారు.
వివిధ జిల్లాల నుండి పాల్గొన్న 200 మంది ప్రతినిధులతో జరిగిన కౌన్సిల్‌లో గత మహాసభ నుండి కౌన్సిల్ వరకు జరిగిన ఉద్యమ కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను మరియు పలు తీర్మానాలను చేసుకున్నట్లుగా అదేవిధంగా గతంలో బిజెపి ప్రభుత్వం చేసిన 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రస్తుత ఎన్.డి.ఏ ప్రభుత్వం బొగ్గు బావులను వేలంపాట వేయాటన్ని నిరసిస్తూ జులై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని కౌన్సిల్ పిలుపు ఇస్తున్నట్లు వారు తెలిపారు.
(IFTU నూతన కార్యవర్గం)
1) రాష్ట్ర అధ్యక్షుడు- కే విశ్వనాధ్ (గోదావరి ఖని)
2) ఉపాధ్యక్షుడు- పి వరదయ్య (నిజామాబాద్)
3) ఉపాధ్యక్షుడు- ఎస్ కె మధార్ (మహబూబాబాద్)
4) ప్రధాన కార్యదర్శి- అరెళ్ళి క్రిష్ణ (వరంగల్)
5) సహాయ కార్యదర్శి – బి రాంసింగ్ (భద్రాద్రి కొత్తగూడెం)
6) సహాయ కార్యదర్శి- నున్న అప్పారావు (వరంగల్)
7) కోశాధికారి- డి లచ్చన్న (పెద్దపల్లి)
(కమిటీ సభ్యులు)
8) టి సాయిలు (నిజామాబాద్)
9) అల్తప్ (నిజామాబాద్)
10) మందాడి శ్రీను (మహబూబాబాద్)
11) దుర్గ ప్రసాద్ (మహబూబాబాద్)
12) జె రాజేందర్ (వరంగల్)
13) పసునూరి రాజు (వరంగల్)
14) మూతి రాంబాబు ( భద్రాద్రి కొత్తగూడెం)
15) అభిలాష్ (హైదరాబాద్)
16) కో- ఆప్షన్
17) కో- ఆప్షన్
(కౌన్సిల్ తీర్మానాలు)
1) కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం 4 కోడ్ లుగా చేయడానికి IFTU వ్యతిరేకిస్తుంది.
2) కార్మికుల హక్కుల కొరకు కొత్త చట్టాలను జీవో లను జారీ చేయాలి.
3) చిన్న పరిశ్రమలపై జీఎస్టీని తొలగించాలి.
4) సింగరేణి బొగ్గు బావుల వేలంపాటను వెంటనే ఆపాలి. కొత్త అండర్ గ్రౌండ్ బాగులను ప్రారంభించాలి.
5) ఉపాధి కూలీలకు రోజుకు 750 రూపాయలు చెల్లించాలి.
6) నెలవారి జీతాలు పొందుతున్న కార్మికులకు నెలకు 26,000 రూపాయల జీతం చెల్లించాలి.
7) మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే అరికట్టాలి నేరస్తులను కఠినంగా శిక్షించాలి.
8) ఆదివాసీలపై బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్న దాడులను నిలిపివేయాలి.
9) ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నడపాలి.
10) హమాలి కార్మికులకు సమగ్ర చట్టాన్ని రూపొందించాలి. అలాగే 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ నెలకు 7000 రూపాయలు చెల్లించే విధంగా చట్టం అమలు చేయాలి
11) అన్ని రంగాలలో పని చేస్తున్నా కార్మికులకు ప్రభుత్వం పక్క ఇంటి నిర్మాణం చేయాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
