Inter Toppers : ఏడిద జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ఆదర్శం

TRINETHRAM NEWS

ఇంటర్ టాపర్ లకు సత్కారం…

మండపేట :త్రినేత్రం న్యూస్. జిల్లా లో అత్యున్నత ఫలితాల సాధనలో ఏడిద జెడ్పీ ప్లస్ పాఠశాల ఆదర్శమని జిల్లా విద్యా శాఖ అధికారి సలీం బాషా పేర్కొన్నారు.ఇంటర్ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సలీం భాషా సత్కరించారు. విద్యార్థుల ప్రవేశాలు , పాటశాల ఆకర్షణ వారోత్సవాలలో భాగంగా ఏడిద జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ ను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సలీం భాషా గురువారం సందర్శించారు. బడి ఆకర్షణ వారోత్సవాల ప్రాధాన్యత విద్యార్థులు ఉపాధ్యాయులకు వివరించారు. పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రగతిని సమీక్షించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందన్నారు. పాఠశాల విజయానికి కారణమైన ప్రధానోపాధ్యాయుల పనితీరును అభినందించారు. ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు.

ఈ సందర్భంగా ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ సాధించిన పంతం రమ్యశ్రీ (433/ 440), ఇంటర్ సెకండియర్ ఐదు లక్షల నగదు బహుమతి సాధించిన స్టేట్ బెస్ట్ మార్క్ సాధించిన కొమ్ము శైలజ (946/1000) ను సెకండ్ ఇయర్ బైపిసి లో కాలేజీ ఫస్ట్ బాదంపూడి సత్య శ్రీ (869/1000) లను జిల్లా విద్యాశాఖ అధికారి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు నాయుడు రామచంద్రరావు, సోమిరెడ్డి గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం, మాజీ సర్పంచ్ చిలుకూరి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు ముంగర వెంకటరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Edidha Zilla Praja Parishad

You cannot copy content of this page

Scroll to Top