ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుమతి లేదు : ఈసీ స్పష్టీకరణ

TRINETHRAM NEWS

Trinethram News : న్యూ డిల్లీ:

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్‌ రోజు అయిన జూన్‌ 1 సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని స్పష్టం చేసింది.

ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అలాగే పోలింగ్‌ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతోపాటు ఇతర ఎలాంటి సర్వేలనూ ప్రసారం చేయకూడదని పేర్కొంది.

You cannot copy content of this page

Scroll to Top