
MLA Hands Over LoC : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 21 ; వేలేరుపాడు మండలానికి చెందిన కారం రమణికి రూ.9 లక్షల 46 వేలు, కొయ్యలగూడెం మండలానికి చెందిన పూలపాకుల సురేష్ కు రూ.5 లక్షల విలువైన ఎల్.ఓ.సీలను పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు తన క్యాంపు కార్యాలయం బర్రింకలపాడులో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పేద మధ్యతరగతి
కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ఆ సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మేచినేని సంజయ్, పొడియం భాను, సోదే నాగేంద్ర, సవలం రాధా, పొడపాటి ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe