జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 06 at 16.52.38

TRINETHRAM NEWS

బడుగు, బలహీనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బడుగు, బలహీనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్దంతి సందర్భంగా స్దానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3,
ఈ దిశగా వారి దార్శనికత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిందన్నారు. వారి విశేష కృషిని, వారు అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో తెలంగాణాలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలుపుకున్నామన్నారు.
దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనమైన కీర్తిని చాటేందుకు మాజీ సిఎం కేసీఆర్‌ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ పాలనా భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అని పేరు పెట్టారని తెలిపారు.
అంటరాని వర్గాలుగా తర తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వారి సామాజిక ఇనుమడింప చేసే దిశగా, అంబేడ్కర్ స్ఫూర్తితోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసిందన్నారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా దళిత బంధు సత్ఫలితాలు సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్పరేటర్లు కల్వచర్ల కృష్ణ వేణీ కుమ్మరి శ్రీనివాస్ గాధం విజయ మాజీ జడ్పీటీసీ అముల నారాయణ నాయకులు నారాయణదాసు మారుతి బోడ్డు రవీందర్ ఇరుగురాళ్ల శ్రావన్ రామరాజు ముద్దసాని సంధ్యా రెడ్డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page