
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 14 త్రినేత్రం న్యూస్ : తవక్లాపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఐ తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని వారి కృషి ఫలితంగానే ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు చదువుకోగలుగుతున్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి నిజాయితీ గల పాలన అందించే విధంగా నాయకులను ఎన్నుకునే గొప్ప అవకాశం కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని మను ధర్మ శాస్త్రాన్ని తీసుకువచ్చి దేశంలోని ప్రజలను దీనస్థితిలోకి నెట్టాలని చూస్తుందని ఇలాంటి అరాచకమైన బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలని మతాల మధ్యన చిచ్చు పెడుతూ అల్లర్లు సృష్టించి జనాలను భయాందోళనకు గురి చేస్తుందని ఇలాంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో AITUC జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు,AIYF నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్,AIYF డిండి మండల కార్యదర్శి ఎలిమినేటి నరేష్,AIYF తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి MD ఆదిల్,గోరటి చంటి,ఎనుక బాలకృష్ణ,నల్లవెల్లి సీతారాం రెడ్డి,వంకేశ్వరం శ్రీను,ఎనమల్ల శ్రీను,నూనె మల్లేష్,వంకేశ్వరం రవి,నూకం రాములు,బన్నీ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
