CPI : సిపిఐ బహిరంగ సభ విజయ వంతానికి ప్రజల వద్ద విరాళం

TRINETHRAM NEWS

సిపిఐ బహిరంగ సభ విజయ వంతానికి ప్రజల వద్ద విరాళం.

డిండి త్రినేత్రం న్యూస్.
భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ. 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా డిసెంబర్ 30 తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే భారీ ప్రదర్శన అనంతరం ఎన్జీ కళాశాలలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ప్రజల నుండి శుక్రవారం దిండి మండల కేంద్రంలో సిపిఐ మండల నాయకత్వం విరాళాలు సేకరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ. జిల్లా సమితి సభ్యులు తూము బుచ్చిరెడ్డి. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మైనోద్దీన్., సిపిఐ మండల కార్యదర్శి రామదాసు కనకాచారి, మండల సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్, తిప్పర్తి విజయేందర్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు కేశవులు, ఎలిమినేటి హుస్సేన్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎనుముల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top