TRINETHRAM NEWS

గిరిజననేతరులకి తొత్తుగా వ్యవహరించే అభ్యర్థులను పిసా కమిటీలో చేర్చవద్దు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.27:

భారత రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులకై పోరాడే అభ్యర్థులను పీసా కమిటీలు ఎన్నుకోవాలని, జివో నంబర్ 3 అమలు, స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నద్ధం కావాలనీ. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి అధ్యక్ష కార్యదర్శులు లోతా రాంబాబు, కిల్లోసురేంద్ర విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతమైన పాడేరు,రంపచోడవరం,ఏలూరు, ఏజెన్సీ,మన్యంపార్వతిపురం, జిల్లాల్లో పీసా కమిటి ఎన్నికలు జరపాలనినోటిఫికేషన్ విడుదల చేసింది, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేంద్ర అటవి సంరక్షణ చట్టాన్ని సవరించి షెడ్యూల్ ప్రాంతంలో గ్రామసభల హక్కులను, హరించి ఆదివాసీల అడవి నుండి దూరం చేస్తున్నది,ప్రస్తుత కూటమీనాయకత్వంలో టీడీపీ, బీజేపీ ,జనసేన ప్రభుత్వం వచ్చి ఆరునెలలు గడిచిన జివో నంబర్ 3 అమలు ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కు అతిగతిలేకుండఉన్నది.
ఏజన్సీ ప్రాంతంలోని పీసా గ్రామ సభల ఉల్లంఘించి గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న హెడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పంద లను నేటి కూటమి ప్రభుత్వం కూడ అమలు చేస్తు అల్లూరి జిల్లా,పాడేరు ఏజెన్సీ ఎర్రవరం,మాన్యం జిల్లా, సాలూరు ,అనకాపల్లి జిల్లా చింతలపూడి, మరియు ఏలేరు ఏజెన్సీలో జీరుగుమిల్లిలో ఆయుధకర్మ గారాం నిర్మాణాలను చేస్తు, ఆదివాసీల గ్రామ సభల అధికారాలను ఉల్లంఘన చేస్తున్నది, గత వైసీపీ ప్రభుత్వం పీసా గ్రామ సభల సర్వ అధికారాలు ధ్వంసం చేస్తు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పీసా గ్రామ సభల అధికారాలు తుంగలో తొక్కినది భారత రాజ్యాంగం ఆదివాసిలకు కల్పించిన హక్కులకై పోరాడే అభ్యర్ధులను పీసా కమిటిలు ఎన్నుకోవాలని,ఆదివాసీ గిరిజన సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ 2.50 లక్షల మంది ఆదివాసీ జీవితాలను సిద్రం చేస్తున్నది 9 మండలంలోని 270 ఆదివాసీ గ్రామాలకు చెందిన షెడ్యూల్ ఏరియా హక్కులు ధ్వంసం చేస్తున్నది, వరదలో నిత్యం ముంచుతుంది, నిర్వాసితులకు అన్యయం చేస్తున్నది.
1/70 చట్టం మరియు అటవీ హక్కుల చట్టం ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయకుండా గిరిజనేతరులకు వందలాది ఎకరాలు భూములు దారదత్తంచేస్తున్నది, పెద్దపెద్ద లాడ్జిలు, రిసార్ట్స్ లు, బినామీ పేర్లతో నిర్మాణాలు ప్రోచ్చహిస్తున్నది, ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామసభలు,2013 భూసేకరణ చట్టం అధికారాలను ఉల్లంఘించి 1570 కోట్లతో హైవే రోడ్లు నిర్మిస్తూ, వందలాది ఎకరాలు ఆదివాసీ బూముల నుండి దూరం చేసి నిర్వ సితులు చేస్తుంది, పీసా చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో సంక్షేమ పదకాలు అమలు మరియు ఏ నిర్మాణం చెయ్యాలన్న పీసా గ్రామ సభలకూన్న సర్వ హక్కులు ధ్వంసం చేస్తు పరిపాలన సాగుతున్నది.
బోయ వాల్మీకిలను గిరిజన జాబితాలో చేర్సేందుకు ప్రస్తుత,టీడీపీ, బీజేపీ,జానసేన ప్రభుత్వం గత వైసిపి ప్రభుత్వ ప్రయత్నాన్ని ఆదివాసీలు అడ్డుకోవాలి, ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులు అధికారం ఆధివాసులదేనని గిరిజ నేతరులకు, భూములు అడవులు పొందే అధికారం లేదని సమతా వర్సెస్ సుప్రీం కోర్టు తీర్పు స్వస్తం చేస్తున్నది, పీసా కమిటి ఎన్నికల్లో ఆదివాసీ హక్కులు,చట్టాలు రక్షణకు పోరాడే అభ్యర్ధులను ఎన్నుకుని రాబోయే కాలంలో జివో నంబర్ 3అమలు, స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు పోరాడేందుకు సిద్ధం కావాలని, షెడ్యూల్ ఏరియాలో కల్పించిన హక్కులు రక్షణకు సిద్ధం కావాలని, ఆదివాసీ గిరిజన సంఘం, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లోత రాంబాబు, కిల్లో సురేంద్ర, తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App