జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 14 at 17.42.14

TRINETHRAM NEWS

DM Sridhar distributed free bus passes to Zilla Parishad Primary School students

మల్కాజిగిరి
14సెప్టెంబర్

మల్కాజిగిరి జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి ఉడత భక్తిగా ఏ డి సి నరసింహ, మహమ్మద్ రషీద్, శ్రీను, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంవత్సరం పాటు ఉచిత బస్ పాస్ లను శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ విల్లియమ్స్ సమక్షంలో రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్ చేతుల మీదగా 100 మంది విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా రాణిగంజ్ డి ఎం శ్రీధర్ మాట్లాడుతూ, కొంతమంది పేద విద్యార్థులు రవాణా సౌకర్యం లేక మధ్యలోనే చదువు మానేస్తున్నారని, అలాంటి విద్యార్థులకు చేయూతనివ్వడానికి తమ సిబ్బంది విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అందజేయాలని మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన తమ సిబ్బందిని అభినందించారు. విద్యార్థులు బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ విలియంస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు బస్సు పాసులు అందజేసిన రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్, వారి సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో రాణిగంజ్ డిఎం శ్రీధర్, ఎడిసి నరసింహ, మహమ్మద్ రషీద్, శ్రీను, ధర్మేందర్, కండక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

DM Sridhar distributed free bus passes to Zilla Parishad Primary School students

1 thought on “Free Bus : జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను పంపిణీ చేసిన డి ఎం శ్రీధర్

Comments are closed.

You cannot copy content of this page