SP Sneha Mehra : ప్రజావాణి కార్యక్రమం లో ఫిర్యాదులతో మాట్లాడిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఐపీఎస్

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిది.. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

అనంతరం ఎస్పీ సంబంధిత అధికారులకు తక్షణమే విచారణ చేసి న్యాయసమ్మతంగా పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని, ప్రతి పిర్యాదుపై నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా తమ సమస్యలను భయపడకుండా నేరుగా పోలీసులను సంప్రదించవచ్చని సూచించారు. చట్ట పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని సంపాదించడమే పోలీస్ శాఖ యొక్క బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని, దీనివల్ల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని ఎస్పీ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SP Sneha Mehra, IPS, spoke with complainants during the Prajavani program

You cannot copy content of this page

Scroll to Top