త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. గురువారం ఐ.డి.ఓ.సి సమావేశ హాలు నందు ఏర్పాటు చేసిన మైక్రో అబ్జర్వరు లు పోలింగ్ రోజున చేపట్టే విధివిధానాల శిక్షణా కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు యాస్మిన్ బాష జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ జిల్లా లో594 గ్రామా పంచయతిలకు గాను 98 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించడం జరుగుతుందని ,ఎన్నికల నిర్వహణ మొత్తానికి కండ్లు, చెవులు మైక్రోఅబ్జర్వర్లె నని , ఎన్నికల నియమావళి ని అనుసరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. వికారాబాద్, తాండూర్, కోడంగల్ , పరిగి నియోజకవర్గాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్ల విధులు కీలకమని అన్నారు. తప్పక చెక్ లిస్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు.
మైక్రో అబ్జర్వర్ల పోలింగ్ రోజున పోలింగ్ బూత్ లో జరిగే పోలింగ్ ప్రక్రియను పరిశీలన చేయడానికి నియమించడం జరుగుతుందని , వెబ్ క్యాస్టింగ్ ,పోలింగ్ బూత్ లో ప్రిసైడింగ్ అధికారికరెక్ట్ గా చేస్తున్నారా లేదా వారు చేసే ప్రతి అంశాన్ని పరిశీలన చేయాలని తెలిపారు. పోలింగ్ రోజున పోలింగ్ నిర్వహణ పరిశీలన చేయాలని సూచించారు. ఎంత మంది పోలింగ్ ఏజెంట్లు హాజరు అయినది లేనిది తప్పక చూడాలని అన్నారు. ముఖ్యంగా బ్యాలట్ బాక్స్లు ఖాలీ గా ఉన్నాయా లేదా చెక్ చేయాలనీ, సీలింగ్ చేస్తున్నారా, లేదా చెక్ చేసుకోవాలని,పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు పరిశీలన చేయాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్ల లు పోలింగ్ ముగిసిన అనంతరం సాధారణ పరిశీలకులకు రిపోర్ట్ లు సబ్మిట్ చేయాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ లో ప్రశాంతంగా నిబద్ధతతో పనిచేయాలని పరిశీలనకు ప్రాధాన్యత ఉండాలని , విధుల పట్ల ఎలాంటి పొరపాట్లు జరుగకుండా విదులు నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లు కు ఆదేశించారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్లు చేయాల్సిన విది విధానాలు మాస్టర్ టైనర్స్ రామ్ రెడ్డి, కృష్ణా రెడ్డి పని చేయు విధానం గురించి వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డి ఆర్ డి ఓ శ్రీనివాస్. ఎల్ డి ఎం యాదగిరి, బి సి వెల్ఫేర్ అధికారి మాధవ రెడ్డి, మైక్రో అబ్జర్వర్స్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


