TRINETHRAM NEWS

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

తబిత సంరక్షణ కేంద్రం పిల్లలతో భేటీ అయిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జనవరి -17: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రామగుండంలోని తబిత సంరక్షణ కేంద్రం పిల్లలు వచ్చి కలిసారు.

తబిత ఆశ్రమంలో చదువుతున్న 10 మంది విద్యార్థులను గుర్తించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వారికి భూపాల్ పల్లి జిల్లా కాటారం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఆశ్రమానికి వచ్చిన పిల్లలు జిల్లా కలెక్టర్ ను కలిసి తమ బాగా చదువు కుంటున్నామని, జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, మనకు జీవితంలో అనేక కష్టాలు, బాధలు వస్తాయని, వాటిని అధిగమించి ధైర్యంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ పిల్లలకు సూచించారు.

ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, వ్యాయామం చేయాలని, కొంత సమయం క్రీడలకు కేటాయించాలని, ఉల్లాస వాతావరణంలో చదువుకోవాలని, చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

గురుకులాల్లో సీట్ ఇప్పించిన జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ కు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్ కు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్,జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App