Collector Harsha : ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

పెద్దపల్లి, మార్చి 10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు
సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన బి.సతీష్ ఎంపీడీవో కార్యాలయం నందు ఒక రూము కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపిడిఓ కు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు
రామగుండం మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన బి.సరిత తమ గ్రామం ఆర్.ఎఫ్.సి.ఎల్ ముప్పు గ్రామమని, సింగరేణి ఆర్జి 2 ఓపెన్ కాస్ట్ మైనింగ్ పక్కనే ఉంటుందని, తాను డీగ్రి బిఎస్సి, పిజిడిసిఏ చేశానని, తనకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా ఉపాధి అధికారిక రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు
పెద్దపల్లి పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన బొంకూరి ప్రవీణ్ తమ కాలనీలో మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని, మురుగునీరు రాకుండా చేసి ఈగల నుండి దోమల నుండి దుర్గంధం నుండి విముక్తి కలిగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

resolve applications of Prajavani

You cannot copy content of this page

Scroll to Top