WhatsApp Image 2024 12 28 at 18.46.58
జనవరి 10 లోపు ఎంపిడీఓ ప్రాంగణంలోని కార్యాలయాల తరలింపు పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*బస్సు డిపో ఏర్పాటుకు భూమి అప్పగింతపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి , డిసెంబర్-28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జనవరి 10 లోపు పెద్దపల్లి ఎంపిడీఓ ప్రాంగణంలోని కార్యాలయాల తరలింపు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బస్సు డిపో ఏర్పాటుకు భూమి అప్పగింతపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, పెద్దపల్లిలో బస్సు డిపో మంజూరైన
నేపథ్యంలో స్థలం అప్పగించేందుకు వీలుగా పెద్దపల్లి ఎంపీడీవో ప్రాంగణంలో ఉన్న కార్యాలయాల తరలింపు వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, అబ్కారీ శాఖ కార్యాలయం తరలింపుకు ప్రభుత్వ భవనాలలో అనువైన చోటున ఎంపిక చేసుకోవాలని, అవసరమైతే ప్రైవేటు భవనాలను సైతం ఎంచుకోవాలని, జనవరి 10 లోపు కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈ.ఈ. పి. ఆర్ .గిరీష్ బాబు, డిఇఓ మాధవి సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
