అనంతగిరి జడ్పీటీసీ దిసరి గంగరాజు
అరకులోయ,ఫిబ్రవరి 16, (త్రినేత్రం న్యూస్): అరకులోయ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ కిట్లను అనంతగిరి జడ్పీటీసీ దిసరి గంగరాజు పంపిణీ చేశారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు సౌకర్యంగా ఉండేందుకు అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు తదితర అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, పదో తరగతితోనే చదువులు ఆపకుండా ఉన్నత విద్యను కొనసాగించాలని, తద్వారా మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని సూచించారు.
ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను క్రమశిక్షణతో నేర్చుకుని, పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ఆయన హితవు పలికారు.
ఈ సందర్భంగా ఏకలవ్య ఉపాధ్యాయులు మాట్లాడుతూ, తమ విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించిన జడ్పీటీసీ దిసరి గంగరాజును అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ఉపాధ్యక్షురాలు, మరియు గంగరాజు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


