TRINETHRAM NEWS

Distortion of injections: morbidity in 17 patients

Trinethram News : అమరావతి : జులై 10
ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ప్రభు త్వాస్పత్రిలో మంగళవారం రాత్రి ఇంజక్షన్‌లు వికటించ డంతో పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు.

నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని పలు గ్రామా లకు చెందిన రోగులు, బాలింతలు రెండు మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు వీరికి ఇంజక్షన్లు ఇచ్చారు.

కాసేపటికే పై అంతస్తులో చికిత్స పొందుతున్న రోగు లు వాంతులు, విరేచనాల తో ఇబ్బంది పడ్డారు. కొంద రికి చలి జ్వరం వచ్చింది. వీరిలో ఐదుగురు చిన్నారు లు ఉన్నారు.

విషయం తెలుసుకున్న వైద్యాధికారి వీరందరికీ విరుగుడు మందులు ఇస్తూనే పోలీసులు, ఉన్నతాధికారులకు తెలియజేశారు. రోగుల సహాయకులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఆందోళన నెలకొంది.

హోం మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్‌తో మాట్లాడా రు. చివరకు అంబులెన్స్‌ల్లో 17 మందిని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు.

బాధితుల్లో సింహాద్రి అనే రోగి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు వైద్యాధి కారి తెలిపారు. ఇంజక్షన్లు వికటించడంపై ఉన్నతాధి కారులు విచారణ ప్రారంభిం చారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distortion of injections: morbidity in 17 patients