త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం మండలానికి చెందిన అంగర పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా జి. హరీష్ కుమార్ తన పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా ఎస్సై హరీష్ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని , ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు సన్నద్ధంగా ఉన్నానని తెలిపారు . ప్రజలకు ఎటువంటి భయమూ లేకుండా నేరాలపై సమాచారం ఇవ్వాలని , పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్నిపెంచేలా పనిచేస్తానని వెల్లడించారు ….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


