WhatsApp Image 2024 07 12 at 18.10.00
Disbursement of accident insurance check to SBI account holder
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ.) శివాజీనగర్ బ్రాంచి అధికారులు ప్రమాదంలో మృతి చెందిన బండ శశికుమార్ కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల
చెక్కు అందజేశారు. గోదావరిఖనికి చెందిన బండ శశికుమార్ ఎస్ బీఐ శివాజీనగర్ బ్రాంచ్ ఖాతాదారు. ఆయన సంవత్సరానికి రూ.500/- చెల్లించి ప్రమాద బీమా తీసుకున్నారు. శశికుమార్ ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. దాంతో బ్యాంక్ అధికారులు మృతుని తల్లి బండ వనితకు గురువారం ఎస్ బీఐ శివాజీనగర్ బ్రాంచిలో రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.
ప్రతిఖాతాదారు ప్రమాదబీమా చేయించుకోవాలని, ఒక వేళ ప్రమాదం జరిగితే ఆకుటుంబానికి ఆర్థిక భరోసా దక్కుతుందని రీజినల్ మేనేజర్ రవీంద్రకుమార్ సింగ్
తెలిపారు.
ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ రవీంద్రకుమార్ సింగ్, చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, బ్రాంచి మేనేజర్ సంతపురి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
