TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ, త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 20: అరకువేలి నియోజకవర్గం ,ఏపీ కాంగ్రెస్ ప్రథాన కార్యదర్శి శాంతకుమారి అధ్యక్షతన అరకులోయ కాంగ్రెస్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ విభాగము నందు, వెంగడ నీలకంఠం,రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ తెల్లగంజి సోమేశ్వరరావు, రెండవసారిగా రాష్ట్ర కోఆర్డినేటర్, సెంబీ ధర్మన్న , రాష్ట్ర కన్వీనర్ సమ్మరెడ్డి బంగారు రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్పర్సన్ నూతనముగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పూల బొకేతో పుష్పగుచ్చము అందజేసి హర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ దూశాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంత కుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు కొరకు పోరాటం చేయాలని, అదేవిధంగా నిరంతరం శ్రమించి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని రాబోయే రోజుల్లో రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పదవులు పొందుతూ గుర్తింపు రాణించాలని తెలియజేశారు.

సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మాకు ఇచ్చిన పదవులను సూచ తప్పకుండా న్యాయం చేయడానికి మా సాయ శక్తులు కృషి చేస్తాము ఎల్లప్పుడూ గిరిజన ప్రాంత సమస్యల కోసం పోరాటం చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారా దిశగా గిరిజన హక్కుల కోసం చట్టాల కోసం పోరాడుతామని, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాచి పెంట చిన్నస్వామి, కిల్లో జగన్నాథం, సాకేరి రామనాయుడు, బురిడీ దుక్కు, కోర్ర మిధుల, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shanthakumari Pachipenta