జూలై 7, 2026

WhatsApp Image 2024 01 05 at 12.08.55 PM

TRINETHRAM NEWS

Trinethram News : కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్లు
పట్టుకున్న స్పెషల్ పోలీస్ టీం

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ పి గారి స్పెషల్ టీమ్ పోలీస్ వారు చిలమత్తూరు మండలం కోడూరు తోపు దగ్గర కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న 14000, లీటర్లు డిజల్ పట్టుకొని చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో పెట్టినారు ట్యాంకర్ SRC వాళ్ళది ఇంతే కాకుండా గుట్టు చప్పుడుగా రాత్రి వేళల్లో డైలీ రెండు ట్యాంకర్లు తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం గత కొంతకాలం నుండి డీజిల్ అక్రమ తరలింపు పై పలు ఫిర్యాదులు వెళుతుండడంతో ఈ విషయం ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక టీం ను పంపించినట్లు సమాచారం.
అక్రమ డీజిల్ తరలింపు కు గోరంట్ల సోమందేపల్లి చిలమతూరుకు చెందిన కొంతమంది పోలీసు వారు కూడా వీళ్ళకి సహకరిస్తున్నట్టు హ డిపార్ట్మెంట్ లోనే గుసగుసలు వస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం

You cannot copy content of this page