TRINETHRAM NEWS

స్వామియే శరణం అయ్యప్ప.. మకరజ్యోతి దర్శనంతో పులకించిన భక్తులు.

Trinethram News : కేరళ : శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగుతున్న వేళ.. మకరవిళక్కు.. మకర జ్యోతి దర్శనంతో భక్తకోటి తరించింది. మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల పొన్నాంబలమేడుపై మకర జ్యోతి కనిపించింది. అయ్యప్ప స్వాములు ఎంతో భక్తితో దర్శించుకునే మకర జ్యోతిని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు.

లక్షలాది భక్తుల ఆశ, శ్వాస అయ్యప్ప!
లక్షలాది భక్తుల ఆశ, శ్వాస అయ్యప్ప! మకరజ్యోతి దర్శనమే వారి దీక్షకు పరమార్థంగా భావిస్తారు. సూర్యస్తమయం తరువాత మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి..ఇరుముడి సమర్పించి..ధన్యోహం ఓ శబరీశా అంటూ మాటలకందని ఆధ్యాత్మికానందాన్ని పొందారు స్వాములు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App