గతంలో కూడా కూల్చారు,ఇప్పుడు కూల్చారు, ఇప్పుడైనా కాపాడండి

TRINETHRAM NEWS

గతంలో కూడా కూల్చారు,ఇప్పుడు కూల్చారు, ఇప్పుడైనా కాపాడండి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

నేడు గాజులరామరం డివిజన్లలో సర్వే నెంబర్ 326,329,342,307 లలో నెలకొన్న అక్రమ నిర్మాణాలను భారీగా కూల్చివేశారు కానీ మొత్తంగా కూల్చివేయ్యలేదని గతంలో కూడా భారీ కూల్చివేత్తలు చేసి వదిలేస్తే మళ్ళీ అక్రమ నిర్మాణాలు వెలిసాయని కానీ భూమి మాత్రం పరిరక్షించబడలేదని కావున ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు.
సీపీఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుండి పోరాడుతుంటే పట్టించుకుంటే ఇంత మంది పేద ప్రజలు కబ్జాదారుల చేతిలో మోసపోయే వాళ్ళు కాదని అన్నారు. ఇప్పుడు కూడా ఇంకా అక్రమ నిర్మాణాలు అలాగే ఉండటం వల్ల కబ్జాదారులు మళ్ళీ ఇప్పుడు కొన్ని కూల్చారు మళ్ళీ కూల్చరు అని చెప్పి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందని కావున ముందుగా ప్రభుత్వ భూమి అని చెప్పే కంచె లు వేయ్యాలని కోరారు. పేద ప్రజలకు శిక్ష వేసి కబ్జాదారులకు ఎలాంటి శిక్ష వెయ్యకపోవడం వల్ల మరోసారి కబ్జాలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ కూల్చివేత్తలు తాత్కాలికం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని, మరోసారి కబ్జాలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top